నాటుకోడి పులుసు
రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.
కావలసిన పదార్ధాలు:
తయారు చేసే విధానం:
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు: 1/2kg
నూనె: 1/2cup
ఆవాలు: 1tsp
మెంతులు: 1tsp
ఉల్లిపాయ తరుగు: 1cup
వెల్లుల్లి తరుగు: 2 tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
అల్లంవెల్లుల్లి పేస్ట్: 4 tsp
పసుపు: 1tsp
కారం: 2 tsp
ధనియాల పొడి: 2tsp
జీలకర్ర పొడి: 1 tsp
టొమాటో గుజ్జు: 1cup
కొబ్బరి పేస్ట్: 1/2cup
పచ్చిమిర్చి నిలువుగా చీరినవి: 6-8
పచ్చి మామిడి ముక్కలు లేదా
చింతపండు పులుసు: 1/2cup
నీళ్లు: తగినన్ని
ఎండుమిర్చి: 2
కొత్తిమీర తరుగు: 2tsp
ఉప్పు: తగినంత
తయారు చేయు విధానము:
1. పాన్లో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడుతుండగా ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి తిప్పి అందులో అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఎండుమిర్చి వేసి ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
2. ఈ మిశ్రమంలో టొమాటో గుజ్జు, కొబ్బరి పేస్ట్ వేసి రెండు నిమిషాలపాటు తిప్పి తగినన్ని నీళ్లు, తగినంత ఉప్పు వేసి అయిదారు నిమిషాలు ఉడకనివ్వాలి.
3. ఇప్పుడు అందులో పచ్చి మామిడి ముక్కలు లేదా చింతపండు పలుసు, శుభ్రపరిచిన చేప ముక్కలు వేసి అన్నిటినీ బాగా కలిపి సన్నని సెగ మీద మూతపెట్టి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ నెల్లూరి చేపల పులుసు వేడి వేడి అన్నంతో పసందుగా ఉంటుంది.

నాటుకోడి మాంసం - 1 కేజి
నూనె - 50 గ్రా.
ఉల్లిపాయలు - 150 గ్రా.
పచ్చిమిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద - సుమారు 100 గ్రా.
ఉప్పు - తగినంత
పసుపు - 1 స్పూను
పెరుగు - 1 కప్పు
కొబ్బరి పొడి - 2 టీ స్పూన్లు
కారంపొడి - 1 స్పూను
ధనియాలపొడి - 1 స్పూను
కొత్తిమీర - 1 కట్ట
పెరుగు - 1 కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.
నెల్లూరు చేపల పులుసు